మందు కలిపిన నీటిని తాగి మృతి | retaired ci died by drinking pesticide water | Sakshi
Sakshi News home page

మందు కలిపిన నీటిని తాగి మృతి

Feb 19 2017 10:43 PM | Updated on Sep 5 2017 4:07 AM

దాహం తీర్చుకోవడంలో భాగంగా పొలం వద్ద మందు కలిపి ఉంచిన నీటిని తాగి ఓ రిటైర్డ్‌ సీఐ మరణించారు.

గూడూరు: దాహం తీర్చుకోవడంలో భాగంగా పొలం వద్ద మందు కలిపి ఉంచిన నీటిని తాగి ఓ రిటైర్డ్‌ సీఐ మరణించారు. ఈ ఘటన గూడూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు ట్రాఫ్రిక్‌ సీఐగా పని చేసిన ఇదూర్‌ సాహెబ్‌ (62)కు గూడూరు సమీపంలో పొలం ఉంది.   తరచూ పొలం పనులు చూసుకోవడానికి కర్నూలు నుంచి గూడూరుకు వస్తుండేవాడు. ఈ నెల 17న పొలంలో పని చూసుకుంటూ దాహం వేయడంతో గదిలో ఓ డబ్బాలో ఉన్న మందు కలిపిన నీటిని పొరపాటున తాగాడు. తర్వాత కొద్ది సేపటికి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కూలీలు గుర్తించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారుడు మాణిక్‌ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement