కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు శని వారం నుంచి జరగనుండగా తమకు అబ్జర్వ ర్ల విధులు కేటాయించాలని కాంట్రాక్చువల్ లెక్చరర్లు, పార్ట్‌టైం లెక్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు కోరారు.
అబ్జర్వర్ విధుల కోసం వినతి
Sep 1 2016 11:48 PM | Updated on Sep 4 2017 11:52 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు శని వారం నుంచి జరగనుండగా తమకు అబ్జర్వ ర్ల విధులు కేటాయించాలని కాంట్రాక్చువల్ లెక్చరర్లు, పార్ట్‌టైం లెక్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు కోరారు.
ఈ మేరకు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు క్యాంపస్‌లో వేచి ఉన్న పలువురు రాత్రి వీసీ ఆర్.సాయన్నకు వినతిపత్రం అందజేశారు. అయితే, వీసీ సాయన్న వారికి పరిశీలకుల విధులు అప్పగించేది లేదని స్పష్టం చేశారు. కాగా, పెద్దసంఖ్యలో అభ్యర్థులు క్యాంపస్‌కు రాగా బందోబస్తు ఏర్పాటుచేశారు.
Advertisement


