11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandalwood caught in chittoor district | Sakshi
Sakshi News home page

11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Apr 25 2017 10:42 AM | Updated on Sep 5 2017 9:40 AM

కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారికోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శేషాచలం అడవుల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఎర్రగట్టు వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులను చూసిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలి పరారయ్యారు. 11 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement