నవ్వుతూనే ఎంతపని చేసిందంటే.. వైరల్‌ వీడియో | Ahmedabad: Saleswoman Caught On Camera Emptying Jewellery Trays | Sakshi
Sakshi News home page

నవ్వుతూనే ఎంతపని చేసిందంటే.. వైరల్‌ వీడియో

May 13 2026 7:53 PM | Updated on May 13 2026 8:19 PM

Ahmedabad: Saleswoman Caught On Camera Emptying Jewellery Trays

అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ షాపులో పనిచేస్తున్న మహిళ సుమారు రూ. 1.5 కోట్ల విలువైన బంగారు నగలను దొంగిలించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ జ్యువెలరీ స్టోర్‌లో ఆ యువతి.. చాలా ప్రశాంతంగా, ముఖంపై చిరునవ్వుతోనే ట్రేలలో ఉన్న నగలను ఖాళీ చేయడం వీడియోలో కనిపించింది. నిందితురాలు గత 11 నెలలుగా అదే షోరూమ్‌లో పనిచేస్తోంది.

దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే.. ఆమె నగలు ఉన్న ట్రేలను పరీక్షిస్తున్నట్లు నటిస్తూ.. అందులోని బంగారు ఆభరణాలను తీసి తన జేబుల్లోకి నింపుకుంది. రింగులు, గొలుసులు, మంగళసూత్రాలు, పట్టీలు ఇలా వరుసగా బంగారు వస్తువులను ఏరి తన జేబులో వేసుకోవడం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.

జ్యువెలరీ స్టోర్ ఖాతాల్లో తేడాలు రావడంతో.. షోరూమ్ మేనేజర్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడే ఈ భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది. గుజరాత్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement