breaking news
sales woman
-
నవ్వుతూనే ఎంతపని చేసిందంటే.. వైరల్ వీడియో
అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ షాపులో పనిచేస్తున్న మహిళ సుమారు రూ. 1.5 కోట్ల విలువైన బంగారు నగలను దొంగిలించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ జ్యువెలరీ స్టోర్‌లో ఆ యువతి.. చాలా ప్రశాంతంగా, ముఖంపై చిరునవ్వుతోనే ట్రేలలో ఉన్న నగలను ఖాళీ చేయడం వీడియోలో కనిపించింది. నిందితురాలు గత 11 నెలలుగా అదే షోరూమ్‌లో పనిచేస్తోంది.దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే.. ఆమె నగలు ఉన్న ట్రేలను పరీక్షిస్తున్నట్లు నటిస్తూ.. అందులోని బంగారు ఆభరణాలను తీసి తన జేబుల్లోకి నింపుకుంది. రింగులు, గొలుసులు, మంగళసూత్రాలు, పట్టీలు ఇలా వరుసగా బంగారు వస్తువులను ఏరి తన జేబులో వేసుకోవడం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.జ్యువెలరీ స్టోర్ ఖాతాల్లో తేడాలు రావడంతో.. షోరూమ్ మేనేజర్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడే ఈ భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది. గుజరాత్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.અમદાવાદમાં કરોડોની જ્વેલરી પર સેલ્સગર્લનો 'હાથફેરો'1.11 કરોડનું સોનું લઈ હર્ષિદા ફરાર!નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા 'આભૂષણ' જ્વેલરી શોરૂમમાં માર્કેટિંગ અને સેલ્સમાં કામ કરતી હર્ષિદા શેટ્ટી આશરે 1211.991 ગ્રામ (1.2 કિલોથી વધુ) સોનું ચોરીને ફરાર. ચોરાયેલાં સોનાની કિંમત… pic.twitter.com/E4jIdfw76n— Sagar Patoliya (@kathiyawadiii) May 13, 2026 -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
హైదరాబాద్: దుస్తుల దుకాణంలో పనిచేసే ఓ మహిళ హత్యకు గురైంది. డబీర్‌పురాలో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలివీ... అబిడ్స్‌లోని రూప్‌సాగర్ బట్టల షోరూంలో జీనత్(35) సేల్స్ ఉమన్‌గా పనిచేస్తుండేది. ఆమె డబీర్‌పురాలోని బాల్షెట్టిఖేత్ ప్రాంతంలో నివాసం ఉండేది.ఈ క్రమంలో తన గదిలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతో పాటు రూప్‌సాగర్ షోరూంలో పనిచేసే సయ్యద్ మొహ్సిన్ మంగళవారం ఉదయం ఆమె గదికి రాగా విషయం వెలుగులోకి వచ్చింది. అతడి సమాచారం మేర కు సీఐ మట్టయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆమె ముఖంపై దిండుతో అదిమి చంపేశాడని తెలిపారు. కాగా, మొహ్సిన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం తనను జీనత్ రూ.3,000 అప్పు అడిగిందని.. ఆ డబ్బును తీసుకుని ఆమె గదికి వెళ్లగా చనిపోయి ఉందని చెబుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


