రావణ వాహనాధీశా... పాహిమాం | ravana vahanadhisa ... pahimam | Sakshi
Sakshi News home page

రావణ వాహనాధీశా... పాహిమాం

Jan 13 2017 10:31 PM | Updated on Sep 27 2018 5:46 PM

రావణ వాహనాధీశా... పాహిమాం - Sakshi

రావణ వాహనాధీశా... పాహిమాం

మకర సంక్రమణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సకలభోగ సౌభాగ్యాలనిచ్చే భోగి పర్వదినాన శ్రీశైల మల్లికార్జునుడు దేవేరి భ్రామరితో కలిసి రావణవాహనంపై దర్శనమిస్తూ అభయమిచ్చారు.

శ్రీశైలం: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సకలభోగ సౌభాగ్యాలనిచ్చే భోగి పర్వదినాన శ్రీశైల మల్లికార్జునుడు దేవేరి భ్రామరితో కలిసి రావణవాహనంపై  దర్శనమిస్తూ  అభయమిచ్చారు. శ్రీశైల ఆలయంలో సంకమ్రణ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై ఉంచి విశేష వాహనపూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులకు   అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తరీతిన ప్రత్యేక పూజలు చేశారు. రావణ వాహనాధీశులైన స్వామి, అమ్మవార్ల  ఉత్సవమూర్తులను ఆలయప్రద„ìణ  చేయించి ఊరేగింపుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. నారికేళ ఫలపుష్పాదులను  సమర్పించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో  వేలాది  మంది భక్తులు పాల్గొని కర్పూరనీరాజనాలను అర్పించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌ గుప్త, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్‌ డాక్టర్‌ కడప అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement