ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్న 'రాజీవ్‌' ర్యాలీ | Rajeev gandhi sadhbhavana ralley arrives to andhra ratna bhavan | Sakshi
Sakshi News home page

ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్న 'రాజీవ్‌' ర్యాలీ

Aug 10 2016 1:19 PM | Updated on Jun 2 2018 6:38 PM

రాజీవ్‌గాంధీ సద్భావన ర్యాలీ బుధవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు చేరుకుంది.

విజయవాడ: రాజీవ్‌గాంధీ సద్భావన ర్యాలీ బుధవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు సి.రామచంద్రయ్య, కనుమూరి బాపిరాజు, మల్లాది విష్ణు స్వాగతం పలికారు.

ఈ సద్భావన యాత్ర 19వ తేదీన ఢిల్లీ చేరుతుందని మల్లాది విష్ణు తెలిపారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నేత రాజీవ్‌గాంధీ అని ఆయన కొనియాడారు. దేశంలో తీవ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరముందని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement