నాలుగు రోజుల్లో వర్షసూచన | rain information | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో వర్షసూచన

Apr 28 2017 11:08 PM | Updated on Jun 1 2018 8:39 PM

రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు శుక్రవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌ విడుదల చేశారు.

హైదరాబాద్‌ నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 29 నుంచి మే 3వతేదీ వరకు 5 నుంచి 7 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు, కనిష్టంగా 24 నుంచి 25 డిగ్రీలు నమోదుకావచ్చన్నారు. గంటకు 7 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement