జిల్లాలోని 30 మండలాల్లో ఆదివారం రాత్రి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికగా మంత్రాలయంలో 28.2 మిమీ వర్షపాతం నమోదైంది.
జిల్లాలో పలు చోట్ల వర్షాలు
Oct 11 2016 12:22 AM | Updated on Sep 4 2017 4:54 PM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 30 మండలాల్లో ఆదివారం రాత్రి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికగా మంత్రాలయంలో 28.2 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద 5మిమీ వర్షపాతం నమోదు అయింది. ఈ వర్షాల వల్ల రబీ పంటలకు, ఖరీప్‌లో సాగు చేసిన కంది పంటకు ఉపశమనం లభించింది. ఎమ్మిగనూరులో 26.2, గొనెగండ్లలో 26.4, కొసిగిలో 19.4, మిడుతూరులో 17.2, ఓర్వకల్‌లో 17.2, ఉయ్యలవాడలో 14.6,నందవరంలో 13.8, ఆళ్లగడ్డలో 12.4, బండిఆత్మకూరులో 11.8మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి.
Advertisement
Advertisement