నాలుగు రోజుల్లో వర్షసూచన | rain in four days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో వర్షసూచన

Jun 23 2017 11:33 PM | Updated on Jun 1 2018 8:39 PM

రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై 4 నుంచి 12 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 68, మధ్యాహ్నం 54 నుంచి 58 శాతం మధ్య ఉండొచ్చన్నారు. గంటకు 11 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement