సింహవాహనంపై దర్శనమిచ్చిన రఘురాముడు | raghuramudu on simhavahanam | Sakshi
Sakshi News home page

సింహవాహనంపై దర్శనమిచ్చిన రఘురాముడు

Apr 6 2017 11:12 PM | Updated on Sep 5 2017 8:07 AM

వైభవంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మొదటిరోడ్డులోని శ్రీ కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో వాహన సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం కల్చరల్‌ : వైభవంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మొదటిరోడ్డులోని శ్రీ కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో వాహన సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీసీతారాములకు అభిషేక,  అలంకార సేవలు జరిగాయి. సాయంత్రం సీతా సమేతుడై శ్రీరాముడు సింహవాహనంపై ఊరేగి దర్శనమిచ్చాడు. ప్రాచీన కళారూపకాలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన మండలి బృందాలు రామనామస్మరణ మార్మోగుతుండగా భక్తులు స్వామివారికి నీరాజనాలర్పించారు. ఈ సందర్భంగా నృత్యకళానికేతన్‌ సంధ్యామూర్తి శిష్యబృందం శాస్త్రీయ నృత్యాలతో స్వామివారికి నీరాజనాలర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నాగేంద్రరావు, సురేష్, రామసుబ్రమణ్యం, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement