మార్పుతోనే నాణ్యమైన వైద్యం | quality treatment state level seminor | Sakshi
Sakshi News home page

మార్పుతోనే నాణ్యమైన వైద్యం

Dec 17 2016 11:21 PM | Updated on Sep 4 2017 10:58 PM

వృత్తి ఒత్తిడిలో పడి వైద్యరంగంలో వస్తున్న మార్పులను గుర్తించకపోతే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించలేరని పలువురు వైద్య ప్రముఖులు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఇండియ¯ŒS డెంటల్‌ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో

  • ఘనంగా 37వ రాష్ట్ర స్థాయి దంత వైద్య సదస్సు
  • కాకినాడ వైద్యం :
    వృత్తి ఒత్తిడిలో పడి వైద్యరంగంలో వస్తున్న మార్పులను గుర్తించకపోతే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించలేరని పలువురు వైద్య ప్రముఖులు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఇండియ¯ŒS డెంటల్‌ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో జరుగుతున్న 37వ రాష్ట్ర స్థాయి దంత వైద్య సదస్సు రెండోరోజైన బుధవారం ఘనంగా జరిగాయి. దంత వైద్య శాస్త్రంలో వస్తున్న మార్పులు, ఆధునిక పరిజ్ఞానం, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలను రీసోర్స్‌పర్సన్లు డా.అశోక్‌ లేలె, డా. రుబి¯ŒS రూబే వివరించారు.  మూడు విభాగాలుగా సదస్సు జరిగింది. తొలుత జాతీయస్థాయి రీసోర్స్‌పర్సన్ల ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్రంలోని పలు డెంటల్‌ కళాశాలలకు చెందిన వైద్య విద్యార్థులు 350 ప్రతులను సెమినార్‌లో ప్రెజెంటేష¯ŒS చేశారు.
    సేవా దృక్పథంతో సేవలందించాలి
    నిరుపేదలకు సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలని ముఖ్యఅతిథి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఆయన జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా డెంటల్‌ పరికరాల ట్రేడ్‌ఫేర్‌ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్‌ ప్రారంభించారు. మరో విభాగంలో వైద్యులు, వైద్య విద్యార్థులు తమ వైద్యవృత్తిలో అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రస్థాయి సెమినార్‌ను కాకినాడలో తొలిసారిగా నిర్వహించడంతో దీనిని నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్యక్రమంలో రంగరాయ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.కె.మహాలక్ష్మి, ఇండియ¯ŒS డెంటల్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు డా. టీఎ¯ŒS తిలక్‌రాజ్, ఏపీ స్టేట్‌ అధ్యక్షుడు డా.వి.వరప్రసాద్, కార్యదర్శి డా.కె.అజయ్‌ బెనర్జీ, పలువురు కార్యనిర్వాహక సభ్యులు, సుమారు వెయ్యి మంది వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement