ముగ్గురు ఖాకీలపై వేటు | punishment on three police | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఖాకీలపై వేటు

Aug 11 2017 10:41 PM | Updated on Jun 1 2018 8:39 PM

మట్కా బీటర్లతో జతకట్టిన ఖాకీలపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ కొరఢా ఝుళిపించారు.

మట్కాబీటర్లతో దోస్తీ ఫలితం..
– గోరంట్ల హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌
– మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ వీఆర్‌కు

అనంతపురం సెంట్రల్‌: మట్కా బీటర్లతో జతకట్టిన ఖాకీలపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ కొరఢా ఝుళిపించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గోరంట్ల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేష్‌ను సస్పెండ్‌ చేస్తూ.. మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ రవినాయక్, రామకృష్ణలను వీఆర్‌కు పంపారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయంతో పోలీసు అధికార వర్గాల్లో కలకం రేపుతోంది. గోరంట్లలో పోలీసుల సహకారంతో మట్కా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని లోతుగా విచారించిన అనంతరం జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. గతంలో కూడా మట్కా, బెట్టింగ్‌ రాయళ్లతో జతకట్టిన పోలీసులపై వేటు పడింది. అయినా కూడా కొంతమందిలో మార్పు రాలేదు. ఈ విషయాన్ని ఎస్పీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదనే సంకేతాలు పంపినట్లైందని పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement