ఇద్దరు గ్రేడ్‌–1 వార్డెన్లకు ఏబీసీడబ్ల్యూఓలుగా పదోన్నతి | promotions for hostel wardens | Sakshi
Sakshi News home page

ఇద్దరు గ్రేడ్‌–1 వార్డెన్లకు ఏబీసీడబ్ల్యూఓలుగా పదోన్నతి

Jul 23 2016 11:06 PM | Updated on Sep 4 2017 5:54 AM

జిల్లాలోని ఇద్దరు గ్రేడ్‌–1 బీసీ వసతి గృహ సంక్షేమాధికారులకు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ సంజీవరాజు తెలిపారు.

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని ఇద్దరు గ్రేడ్‌–1 బీసీ వసతి గృహ సంక్షేమాధికారులకు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ సంజీవరాజు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకూరు ఐడబ్ల్యూహెచ్‌ వసతి గృహ సంక్షేమాధికారిణి లక్ష్మిదేవికి పదోన్నతి కల్పించి నంద్యాలకు, మీదివేముల వసతి గృహ సంక్షేమాధికారి రోషన్నకు పదోన్నతి కల్పించి వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు బదిలీ చేశారన్నారు. నిర్ణీత గడువులోగా వీరు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపడతారని సంజీవరాజు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement