తపాలా ..టోకరా రూ.20 లక్షల పైనే | postal department corrupted | Sakshi
Sakshi News home page

తపాలా ..టోకరా రూ.20 లక్షల పైనే

Dec 31 2016 12:06 AM | Updated on Sep 22 2018 8:25 PM

కాకినాడ తపాలా శాఖలో ఇద్దరు ఉద్యోగులు నోట్ల మార్పిడిలో రూ.20 లక్షలపైనే టోకరా వేశారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచీ జనం నగదు కోసం బారులు తీరుతూ అవస్థలు పడుతున్నారు. 50 రోజులు గడుస్తున్నా కష్టాలు తీరే అవకాశాలు

బాలాజీచెరువు (కాకినాడ): 
కాకినాడ తపాలా శాఖలో ఇద్దరు ఉద్యోగులు నోట్ల మార్పిడిలో రూ.20 లక్షలపైనే టోకరా వేశారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచీ జనం నగదు కోసం బారులు తీరుతూ అవస్థలు పడుతున్నారు. 50 రోజులు గడుస్తున్నా కష్టాలు తీరే అవకాశాలు కనిపించడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వరుసలో ఉంటే తీరా కౌంటర్‌ వద్దకు వెళ్లే సరికి క్యాష్‌ లేదంటూ క్యాషియర్లు బోర్డులు పెట్టేయడంతో ఉసూరంటూ వెనుదిరిగుతున్నారు. వచ్చిన కొత్త నోట్లను పక్కదారి పట్టిస్తున్న కొంతమంది కటకటాలపాలవుతున్నా భయం లేకుండా అదే బాట పడుతున్న ఉద్యోగుల మాదిరిగానే వీరూ తప్పటడుగు వేసి సీబీఐ వలలో చిక్కుకున్నారు. గత నెల రోజుల నుంచి ఇప్పటి వరకూ దాదాపు రూ.20 లక్షలకు„ý పైగా నల్లధనాన్ని తపాలాశాఖ అధికారులు మార్చినట్లు అదే శాఖ ఉద్యోగి కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి కాకినాడ ప్రధాన తపాల కార్యాలయంలో సోదాలు చేపట్టినట్టు తెలిసింది. గత రెండు రోజులుగా తనిఖీలు చేసి అన్ని ఆధారాలు సేకరించిన సీబీఐ సిబ్బంది ట్రెజరర్‌ ఎంఎస్‌కె శ్రీనివాస్‌తోపాటు హెడ్‌పోస్టుమాస్టర్‌ బి.సుభాకర్‌ను గురువారం రాత్రి  అదుపులోకి తీసుకుని విశాఖపట్నం తీసుకెళ్లారు. నగదు మార్పిడి ప్రారంభమైన రోజుల్లో అదే శాఖలో  వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇమ్మన్నా నిబంధనలు సాకుతో నిరాకరించిన హెడ్‌ పోస్టుమాస్టరే దీనికి సూత్రధారిగా మారడం గమనార్హం. నోట్ల మార్పిడి కోసం వీరిద్దరూ బ«ంధువుల ఆధార్‌ , ఇతర వివరాలు ఇందుకు ఉపయోగించిన నేపధ్యంలో శుక్రవారం వారందరనీ విచారించారు.  

Advertisement
 
Advertisement
Advertisement