పోస్టల్ ఉద్యోగులకు బిగ్‌ న్యూస్‌.. దీపావళి కానుక ప్రకటన | Big news for central employees before Diwali 60 days bonus announced | Sakshi
Sakshi News home page

పోస్టల్ ఉద్యోగులకు బిగ్‌ న్యూస్‌.. దీపావళి కానుక ప్రకటన

Oct 19 2025 9:42 PM | Updated on Oct 19 2025 9:49 PM

Big news for central employees before Diwali 60 days bonus announced

దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఆనందకరమైన బహుమతిని ప్రకటించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత-లింక్డ్ బోనస్‌ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పోస్టల్ ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది.

ఈ బోనస్‌ను పొందే ఉద్యోగుల వర్గాలు

  • పోస్టల్ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఈ బోనస్ పొందడానికి ఈ కింది వర్గాల ఉద్యోగులు అర్హులు
  • రెగ్యులర్ ఉద్యోగులు - గ్రూప్ సి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు.
  • గ్రామీణ డాక్ సేవకులు - రెగ్యులర్ సర్వీస్‌లో ఉన్నవారు
  • తాత్కాలిక, ఫుల్‌టైమ్‌ క్యాజువల్‌ ఉద్యోగులు
  • అదనంగా, 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా డిప్యుటేషన్‌కు వెళ్లిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ కు అర్హులు.

బోనస్ లెక్కింపు విధానం

  • బోనస్‌ లెక్కించడానికి పోస్టల్ శాఖ స్పష్టమైన ఫార్ములాను కూడా అందించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బోనస్ = (సగటు వేతనం × 60 రోజులు ÷ 30.4). అయితే, బోనస్ లెక్కించడానికి గరిష్ట జీతం పరిమితిని నెలకు రూ .7,000 గా నిర్ణయించారు.
  • గ్రామీణ డాక్ సేవకులకు (జీడీఎస్)కు వారి టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్‌సీఏ), డియర్ నెస్ అలవెన్స్ ఆధారంగా బోనస్ నిర్ణయిస్తారు.
  • తాత్కాలిక లేదా ఫుల్ టైమ్ క్యాజువల్ వర్కర్లకు  వారి అంచనా వేతనం రూ.1,200 ఆధారంగా వారికి అడ్‌హాక్ బోనస్ ఇస్తారు.
  • సర్వీసు విడిచిపెట్టిన అంటే 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా బదిలీ అయిన ఉద్యోగులకు కూడా ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ లభిస్తుందని ఉత్తర్వులో పోస్టల్‌ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement