కొనసాగుతున్న పోలీస్‌ పికెట్‌ | police picketing continues | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పోలీస్‌ పికెట్‌

Jul 29 2016 6:20 PM | Updated on Sep 17 2018 6:18 PM

రాంపూర్‌ చౌరస్తా వద్ద పోలీసుల తనీఖీలు - Sakshi

రాంపూర్‌ చౌరస్తా వద్ద పోలీసుల తనీఖీలు

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో 144 సెక‌్షన్‌ కొనసాగుతోంది. వేములఘాట్‌, పల్లెపహాడ్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామాల చుట్టూ శుక్రవారం కూడా పోలీస్‌ పికెట్‌ కొనసాగింది.

తొగుట: మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో 144 సెక‌్షన్‌ కొనసాగుతోంది. ముంపు గ్రామాలైన వేములఘాట్‌, పల్లెపహాడ్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామాల చుట్టూ శుక్రవారం కూడా పోలీస్‌ పికెట్‌ కొనసాగింది. గ్రామాల్లోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా పరిశీలించి వదులుతున్నారు. తమ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లే పిల్లబాటల వెంట కూడా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.  గ్రామాలను నిర్బంధించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement