సూళ్లూరుపేట: తీర ప్రాంత గ్రామాలైన కొరిడి, కడపట్ర, దామరాయ, వేనాడు పంచాయతీల్లో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిలివేటి షార్ అధికారులను కోరారు.
తీర ప్రాంతాల దాహార్తి తీర్చండి
Published Tue, Aug 9 2016 1:59 AM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
షార్ అధికారులతో ఎమ్మెల్యే కిలివేటి
సూళ్లూరుపేట: తీర ప్రాంత గ్రామాలైన కొరిడి, కడపట్ర, దామరాయ, వేనాడు పంచాయతీల్లో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిలివేటి షార్ అధికారులను కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను వెంటబెట్టుకుని షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డితో సోమవారం ఆయన కార్యాలయంలో చర్చించారు. పేర్నాడు, దామరాయ, కొరిడిలో మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మిస్తే సమస్య తీరుతుందని వివరించారు. దీనిపై తాను గతంలో కూడా వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఆయనతో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగజ్యోతి, డీఓ నందకుమార్, జేఈ ఉమా మహేశ్వరిలను తీసుకెళ్లడంతో అక్కడికక్కడే వారి వద్దనుంచి అనుమతి పత్రాన్ని రాసి ఇప్పించారు. దీంతో కంట్రోలర్ జేవీ రాజారెడ్డి కూడా సానుకూలంగా స్పందించి డైరెక్టర్ కున్హికృష్ణన్‌తో మాట్లాడి మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement