దొంగల ముఠా అరెస్టు... | Pirates gang arrested | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్టు...

Oct 14 2016 1:53 PM | Updated on Aug 2 2018 4:53 PM

దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను భీమడోలు పోలీసులు పట్టుకున్నారు.

-  భారీగా సొత్తు స్వాధీనం
భీమడోలు(పశ్చిమగోదావరి)

 తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు సబ్‌డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా వీరు చోరీలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.21.76 లక్షల నగదుతోపాటు 440 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వారిని రిమాండ్‌కు పంపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement