పీహెచ్‌డీ ప్రవేశ ఫలితాలు విడుదల | phd entrance result release | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ ప్రవేశ ఫలితాలు విడుదల

Mar 30 2017 11:18 PM | Updated on Sep 5 2018 8:36 PM

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ గురువారం విడుదల చేశారు.

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ గురువారం విడుదల చేశారు. 3,049 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,493 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య డి.సుబ్బారావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌ .కృష్ణయ్య, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆచార్య విజయ్‌కుమార్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ఆచార్య డి.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement