ఉరివేసుకుని వ్యక్తి మృతి | person suicide | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వ్యక్తి మృతి

Oct 18 2016 1:19 AM | Updated on Jul 11 2019 5:40 PM

ఏలూరు అర్బన్‌ : కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఓ చిరువ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏలూరు అర్బన్‌ : కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఓ చిరువ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల కథనం ప్రకారం.. స్థానిక 4వ డివిజన్‌ సత్యనారాయణ పేటకు చెందిన ఆంబోతుల చక్రధర్‌ భార్య సంతు, ఇద్దరు పిల్లలతో కలిసి కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. చాలాకాలంగా భార్యాభర్తలిద్దరికీ మధ్య మనస్పర్థలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన చక్రవర్తి భార్యాపిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. దీనిని గమనించిన భార్య స్థానికుల సాయంతో అతనిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ ఎస్సై కె.రామారావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement