'ఎమ్మెల్యేలను కొంటూ, భూములు సంపాదించుకుంటూ..' | peddireddy ram chandra reddy fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేలను కొంటూ, భూములు సంపాదించుకుంటూ..'

May 8 2016 4:37 PM | Updated on Jul 28 2018 6:51 PM

'ఎమ్మెల్యేలను కొంటూ, భూములు సంపాదించుకుంటూ..' - Sakshi

'ఎమ్మెల్యేలను కొంటూ, భూములు సంపాదించుకుంటూ..'

ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వదని తెలిసినా సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

విజయవాడ:
ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వదని తెలిసినా సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొంటూ, రాజధానిలో భూములు సంపాదించుకుంటూ ఏపీ ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు.

ఓటుకు కోట్లు కేసు భయంతోనే చంద్రబాబు రాత్రికి రాత్రే విజయవాడ వచ్చేశారని తెలిపారు. అందుకే పాలమూరు ప్రాజెక్ట్కు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచినా చంద్రబాబు స్పందించటం లేదని ధ్వజమెత్తారు. కర్నూలులో దీక్ష చేస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగానే చంద్రబాబుకు తెలంగాణ ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement