లంచం ఇస్తేనే బిడ్డను ఇస్తాం | Patient's complaint on GGH staff | Sakshi
Sakshi News home page

లంచం ఇస్తేనే బిడ్డను ఇస్తాం

May 2 2016 8:53 AM | Updated on Sep 22 2018 8:22 PM

లంచం ఇస్తేనే బిడ్డను ఇస్తాం - Sakshi

లంచం ఇస్తేనే బిడ్డను ఇస్తాం

‘మగబిడ్డ పుడితే రూ.వెయ్యి ఇవ్వాలి.. ఆడపిల్ల పుడితే రూ.500 ఇవ్వాలి. లేదంటే మీ బిడ్డను ఇవ్వం’ అంటూ...

గుంటూరు మెడికల్: ‘మగబిడ్డ పుడితే రూ.వెయ్యి ఇవ్వాలి.. ఆడపిల్ల పుడితే రూ.500 ఇవ్వాలి. లేదంటే  మీ బిడ్డను ఇవ్వం’ అంటూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో పనిచేస్తున్న ఆయాలు లంచాలు డిమాండ్ చేస్తున్నారని పలువురు బాలింతల కుటుంబసభ్యులు ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదుతో ఆర్‌ఎంవో డాక్టర్ రమేశ్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు కాన్పుల విభాగంలో విచారించారు. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో)లు పి.పద్మ, ఆర్.కమల, సత్యవేదంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ తెలిపారు. సంఘటనలు పునరావృత్తం కాకుండా కాన్పుల విభాగంలో లోపల, వరండా వైపు సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement