ఆస్పత్రికి వైద్యులు రావడం లేదని ఆగ్రహించిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిపై బాధితుల దాడి
Jul 9 2016 1:50 PM | Updated on Sep 4 2017 4:29 AM
వి. కోట: ఆస్పత్రికి వైద్యులు రావడం లేదని ఆగ్రహించిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఆరు నెలలుగా వైద్యులు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహించిన బాధితులు శనివారం ఆస్పత్రిపై దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సుమారు వంద మంది ఆస్పత్రిపై దాడి చేశారు. ప్రైవేట్ ప్రాక్టీస్‌ల గోలలో పడి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement