పాస్‌పోర్టు కార్యాలయ ప్రారంభం వాయిదా వేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పాస్‌పోర్టు కార్యాలయ ఏర్పాట్లు నిలిచిపోయాయన్నారు.
పాస్‌పోర్టు కార్యాలయ ప్రారంభం వాయిదా
Feb 24 2017 12:16 AM | Updated on Sep 5 2017 4:26 AM
కర్నూలు (ఓల్డ్‌సిటీ):
పాస్‌పోర్టు కార్యాలయ ప్రారంభం వాయిదా వేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పాస్‌పోర్టు కార్యాలయ ఏర్పాట్లు నిలిచిపోయాయన్నారు. ఈనెల 17న రీజనల్ పాస్‌పోర్టు అధికారి చౌదరి సందర్శించినట్లు తెలిపారు. పాస్‌పోర్టు అధికారులు పూర్తిస్థాయిలో ప్రణాళిక ఏర్పరచుకున్న తర్వాతే పనుల ప్రారంభానికి సంకేతం ఇస్తారన్నారు. కాగా కర్నూలు ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పాస్‌పోర్టు కార్యాలయం మార్చి నెలాఖరు లోపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Advertisement
Advertisement