'కావాలనే మాపై బురద జల్లుతున్నారు' | parakala prabhakar takes on trs minister | Sakshi
Sakshi News home page

'కావాలనే మాపై బురద జల్లుతున్నారు'

Jul 6 2016 12:52 PM | Updated on Sep 4 2017 4:16 AM

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు.

హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. దీనిపై ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

బుధవారం విజయవాడలో పరకాల ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. కావాలనే మాపై బురద జల్లుతున్నారని తెలంగాణ మంత్రిపై ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పోర్టల్ ద్వారా ఇప్పటికే 9 వేల లావాదేవిలు జరిగాయని పరకాల ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాపై ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో ముందు చెప్పాలని పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement