పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలి | padmashalis should Excelled in all fields | Sakshi
Sakshi News home page

పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలి

Oct 17 2016 12:52 AM | Updated on Sep 4 2017 5:25 PM

పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఓఎస్‌డీ గురుమూర్తి అన్నారు.

– అసెంబ్లీ స్పీకర్‌ ఓఎస్‌డీ గురుమూర్తి
 
కర్నూలు:    పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలని  ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఓఎస్‌డీ గురుమూర్తి అన్నారు. స్థానిక పాతబస్టాండులో ఎస్‌వీసీ కళ్యాణ మండపంలో ఆదివారం పద్మశాలీ అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పద్మశాలీయుల ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఓఎస్‌డీ గురుమూర్తి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. టెలికామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కేవీకే ప్రసాద్, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ సీవీ పవన్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు డా.సంజీవ్‌కుమార్‌ మాట్లాడారు. రాయలసీమ పద్మశాలీయుల సంఘం అధ్యక్షుడు చెన్న వెంకటసుబ్బన్న, కార్యదర్శి నాగమళ్ల శంకర్, కర్నూలు నగర అధ్యక్షుడు లక్ష్మినారాయణ, పద్మశాలీ అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, కస్తూరి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బీమునిపల్లె వెంకటసుబ్బయ్య, సాయిబాబా  పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement