కారు బోల్తా : ఒకరి మృతి | one killed in road accident in nalgonda district | Sakshi
Sakshi News home page

కారు బోల్తా : ఒకరి మృతి

Aug 18 2016 9:51 AM | Updated on Aug 30 2018 4:07 PM

కృష్ణా పుష్కరాలకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది.

నల్లగొండ : కృష్ణా పుష్కరాలకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు తిరుపతమ్మ గుడి సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది.

దీంతో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి... అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement