శంకర్‌పల్లి మండలం పత్తేపూర్ గ్రామ శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
శంకర్‌పల్లి మండలం పత్తేపూర్ గ్రామ శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న వెంకటయ్య(45) అనే వ్యక్తి ఎదురుగా వస్తోన్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటయ్య స్వస్థలం చేవెళ్ల మండలం కమ్మెట అనుబంధగ్రామం గొల్లగూడ. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.