బస్సును తాకిన కరెంట్ తీగ... ఒకరి మృతి | one killed due to current shock in srikakulam district | Sakshi
Sakshi News home page

బస్సును తాకిన కరెంట్ తీగ... ఒకరి మృతి

Aug 3 2016 12:37 PM | Updated on Sep 4 2017 7:40 AM

శ్రీకాకుళం జిల్లా హీరమండలం గులుమూరు సమీపంలో బస్సుకు కరెంటు తీగలు తగిలి ఒకరు చనిపోయారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా హీరమండలం గులుమూరు సమీపంలో బస్సుకు కరెంటు తీగలు తగిలి ఒకరు చనిపోయారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 20 మంది ప్రయాణికులతో వెళుతోంది. గులుమూరు వద్ద రహదారిపై చెట్టు అడ్డంగా పడి ఉండటంతో డ్రైవర్ బస్సును మరో దారిలో మళ్లించాడు.

అయితే బస్సు వెళ్తుండగా పైన ఉన్న కరెంటు తీగలు తగిలి షాక్ వచ్చింది. దీంతో బస్సులోని జయలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే చనిపోగా డ్రైవర్తోపాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement