వాగులో కొట్టుకుపోయి..ఒకరు గల్లంతు | One displaced in flood water | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకుపోయి..ఒకరు గల్లంతు

Sep 15 2016 6:28 PM | Updated on Aug 1 2018 4:01 PM

వాగు వరదలో ఆటో కొట్టుకుపోవటంతో అందులోని ఒక వ్యక్తి గల్లంతయ్యాడు.

వాగు వరదలో ఆటో కొట్టుకుపోవటంతో అందులోని ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కోహిర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి ఆటోలో వెళ్తుండగా ఉద్దండాపూర్ గ్రామం గుండ్లమడుగుతండా సమీపంలో వాగు వరదలో చిక్కుకున్నారు. వరద నీటి ఉధృతికి ఆటో కొట్టుకుపోగా అందులోని వారు కేకలు వేశారు. గ్రామస్తులు వెంటనే స్పందించి ఇద్దరిని కాపాడగలిగారు. గల్లంతైన సాజిద్ అలీ కోసం గురువారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేక పోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement