రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం | one died by hitting train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Apr 29 2017 12:21 AM | Updated on Sep 5 2017 9:55 AM

గుంటుపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య(28) అనే వ్యక్తి శుక్రవారం రైలు ఢీకొని మ​​ృతి చెందాడు.

వెల్దుర్తి రూరల్‌ : గుంటుపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య(28) అనే వ్యక్తి  శుక్రవారం రైలు ఢీకొని మ​​ృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి చెవుడు ఉంది. ఇతను రోజు రాయి కొట్టే పనులకెళ్తాడు.  ఎండలు ఎక్కువగా ఉన్నందున శుక్రవారం తెల్లవారుఝామునే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా  రైలు ఢీకొన్నట్లు అనుమానం. మృతుడికి భార్య కళావతి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement