గుడిసెకు నిప్పు అంట్టుకొని వృద్ధుడు సజీవ దహనమైన సంఘటన బేతవోలులో చోటు చేసుకుంది.
చిలుకూరు: ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పు అంట్టుకొని వృద్ధుడు సజీవ దహనమైన సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని బేతవోలులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యరమళ్ల ముత్తయ్య (80) పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. వృద్ధాప్యం వల్ల ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు.
పక్కనే ఉన్న కుమారుడి ఇంటి నుంచి ముత్తయ్య గుడిసెకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపధ్యంలోనే షార్ట్‌సర్క్యూట్ జరిగి గుడిసెకు నిప్పంటుకుంది. గమనించిన కుమారుడు, స్థానికులు మంటలను అదుపు చేసి వృద్ధుడిని హుజూర్‌నగర్ ప్రజావైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.