వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | notification of doctors postings | Sakshi
Sakshi News home page

వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Sep 19 2017 9:54 PM | Updated on Jun 1 2018 8:45 PM

జిల్లాలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

అనంతపురం మెడికల్‌: జిల్లాలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ రమేశ్‌నాథ్‌ తెలియజేశారు. గైనకాలజిస్ట్‌ పోస్టులు–16, అనస్తిటిస్ట్‌–15, పీడియాట్రీషియన్‌–9, స్టాఫ్‌నర్సులు–52 పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ కోర్సుల్లో ఉత్తీర్ణులై, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిష్టరై ఉండాలి.

స్టాఫ్‌నర్సు పోస్టులకు గాను జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిష్టరై ఉండాలి. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాలను  www.anantapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటు ఉంచారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ‘జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి కార్యాలయం, ప్రభుత్వ సర్వజనాస్పత్రి కాంపౌండ్, అనంతపురం’ చిరునామాకు రిజిష్టర్‌ పోస్టులో గానీ, స్వయంగా గానీ అందజేయచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement