ప్రచారం తప్ప.. పైసా విదల్చలేదు | not given a single paisa | Sakshi
Sakshi News home page

ప్రచారం తప్ప.. పైసా విదల్చలేదు

Sep 28 2016 11:41 PM | Updated on Sep 4 2017 3:24 PM

ప్రచారం తప్ప.. పైసా విదల్చలేదు

ప్రచారం తప్ప.. పైసా విదల్చలేదు

‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా దోమల నివారణకు పంచాయతీలకు పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. నిధులు పరిపుష్టిగా ఉన్న పురపాలక సంఘాలు, మేజర్‌ పంచాయతీల్లో అరకొరగా పనులు చేపడతున్నా.. మైనర్‌ పంచాయతీల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు.

–అట్టహాసంగా ‘దోమలపై దండయాత్ర’ నిధులు 
 –   విడుదల కాక పంచాయతీల అవస్థలు
–  దోమల మందుతో సరిపెడుతున్న వైనం
భీమవరం: 
‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా దోమల నివారణకు పంచాయతీలకు పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. నిధులు పరిపుష్టిగా ఉన్న పురపాలక సంఘాలు, మేజర్‌ పంచాయతీల్లో అరకొరగా పనులు చేపడతున్నా.. మైనర్‌ పంచాయతీల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో వాధ్యుల నివారణకు ఏటా ప్రభుత్వం పంచాయతీకి రూ.10 వేలు నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది దోమల బెడద, వ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉండటంతో మరో రూ.5 వేలు అదనంగా కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సర్పంచ్, ఏఎన్‌ఎం జాయింట్‌ ఆపరేషన్‌తో నిధులు ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. అయితేఇప్పటివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనుల నిర్వహణ ఎలా అంటూ సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. 
మొక్కుబడిగా దోమ మందు పంపిణీ
పంచాయతీలకు నామమాత్రంగా దోమ ల మందు పంపిణీ చేశారని, మందు పిచికారీకి కూలీ ఖర్చులు తాము భరిం చాల్సి వస్తోందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో నిత్యం సంచరించే ఏఎన్‌ఎంలు ఆయా గ్రామాలకు అవసరమైన దోమల మందును అంచనావేసి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయానికి నివేదిక పంపారు. దీంతో గ్రామాలకు ఎబిట్‌ (దోమల నివారణ) మందును ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే బ్లీచింగ్‌ జాడ లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. 
సమిధలవుతున్న విద్యార్థులు
దోమలపై దండయాత్ర కార్యక్రమానికి విద్యార్థులు సమిధలవుతున్నారు. నిధు లు విడుదల కాకపోవడంతో అధికారు లు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో గ్రా మాల్లో ర్యాలీలు నిర్వహించి  మమ అనిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని విద్యా, స్వచ్ఛంద సంస్థల భుజాలపై పెట్టడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను సమిధలుగా చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెం దుతున్నారు. ఎండావానా తేడా లేకుండా గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ బ్లీచింగ్‌ చెల్లించడం, డ్రెయిన్లలో చెత్త తీయించడం వంటి పనులు విద్యార్థులతో చేయిస్తున్నారని పలువురు తల్లిదం డ్రులు ఆరోపిస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement