అమరావతిలో జాతీయక్రీడల నిర్వహణకు సిద్ధం
అమలాపురం రూరల్ :జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. బుధవారం ఎస్‌కేబీఆర్ కాలేజీలో జరిగిన నన్నయ్య యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ విభాగాల్లో పోటీల ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నార
రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం
ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప
అమలాపురం రూరల్ :జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. బుధవారం ఎస్‌కేబీఆర్ కాలేజీలో జరిగిన నన్నయ్య యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ విభాగాల్లో పోటీల ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అన్ని కళాశాలల యాజమాన్యాలూ క్రీడాపోటీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు మండల స్థాయిలో స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఎస్‌కేబీఆర్‌లో వ్యవసాయ, హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఎస్‌కేబీఆర్ కాలేజీ టీం చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. విజేతలు ఫిబ్రవరి 25న చండీగఢ్‌లో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బీసీ కార్పోరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయవెంకటలక్ష్మి, కళాశాల పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి సుబ్బరాజు, జె.వి.జె.ఆర్.భాను, ప్రిన్సిపాల్ వక్కలంక కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.