జాతీయజెండాకు నిప్పు | national flage | Sakshi
Sakshi News home page

జాతీయజెండాకు నిప్పు

Aug 16 2016 12:07 AM | Updated on Sep 5 2018 9:47 PM

జాతీయజెండాకు నిప్పు - Sakshi

జాతీయజెండాకు నిప్పు

నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం అంకోల్‌ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లి గ్రామంలో జాతీయజెండాకు అవమానం జరిగింది.

బస్వాయిపల్లి(బీర్కూర్‌) : నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం అంకోల్‌ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లి గ్రామంలో జాతీయజెండాకు అవమానం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేస్తారు. సోమవారం ఉదయం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బండారి గంగారాం  జాతీయ జెండాను ఎగురవేశారు. సాయంత్రం జెండాను దించి అవతనం చేయడం కోసం వెళ్లగా కర్ర కిందపడి, జాతీయజెండా సగం దగ్ధమై కనిపించింది. దీంతో గ్రామ సర్పంచ్‌ దీపిక కిరణ్‌ గౌడ్‌కు సమాచారం అందించగా పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు దురుద్దేశంతోనే జెండాను కిందపడేసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement