పింఛన్ కోసం వచ్చి... | narayanappa died at school in anantapur district | Sakshi
Sakshi News home page

పింఛన్ కోసం వచ్చి...

Sep 3 2015 11:53 AM | Updated on Sep 28 2018 3:41 PM

పింఛన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు, పింఛన్ తీసుకోకుండానే మృతి చెందాడు.

అనంతపురం : పింఛన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు, పింఛన్ తీసుకోకుండానే మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం బండమీదిపల్లి ఎలిమెంటరీ పాఠశాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. బండమీదిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప (75)  అవివాహితుడు. దాంతో ఉప్పర్‌పల్లి గ్రామంలోని బంధువుల ఇంటిలో నివసిస్తున్నాడు. 

అతడికి పింఛన్ మంజూరైందని సమాచారం అందుకున్నాడు. ఆ క్రమంలో బుధవారం బండమీదిపల్లి గ్రామానికి వచ్చాడు. రిజిస్టర్‌లో నారాయణప్ప చేతి వేలిముద్రలు పడకపోవడంతో అధికారులు గురువారం రమ్మని చెప్పారు. దాంతో నారాయణప్ప బుధవారం రాత్రి అదే పాఠశాలలో నిద్రపోయాడు. గురువారం ఉదయం పాఠశాల వద్దకు వచ్చిన అధికారులు నారాయణప్ప పాఠశాల నేలపై పడి ఉన్నాడు.

అతన్ని లేపేందుకు ప్రయత్నించగా... నారాయణప్ప  లేవలేదు. దీంతో అధికారులు స్థానిక వైద్యుడిని తీసుకు వచ్చి నారాయణప్పను పరీక్షించారు. అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. నారాయణప్ప బంధువులకు ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement