12 గంటలు దాటిన ముద్రగడ ఆమరణ దీక్ష | mudragada padmanabham indefinite fast @ 12 hours | Sakshi
Sakshi News home page

12 గంటలు దాటిన ముద్రగడ ఆమరణ దీక్ష

Feb 5 2016 8:59 PM | Updated on Jul 30 2018 6:25 PM

కాపులను బీసీల జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 12గంటలు దాటింది.

కిర్లంపూడి: కాపులను బీసీల  జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 12గంటలు దాటింది. దీక్షలో ఉన్న ముద్రగడ సతీమణి పద్మావతి షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. కిర్లంపూడిలోని తమ నివాసంలో దీక్షకు కూర్చున్న ముద్రగడ దంపతులకు రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం లభిస్తోంది. కాపులతో పాటు ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడి వైపు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కోసం ఎవ్వరూ కిర్లంపూడికి రావద్దని, వచ్చి, బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలోపడి ఇబ్బందులు పడొద్దని ముద్రగడ మనవి చేశారు. దీక్ష దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement