అసంతృప్తిని చూడకుండా బెదిరింపులా: ఎమ్మెల్సీ పొంగులేటి | Mlc ponguleti Sudhakar Reddy fire | Sakshi
Sakshi News home page

అసంతృప్తిని చూడకుండా బెదిరింపులా: ఎమ్మెల్సీ పొంగులేటి

Nov 8 2015 4:05 AM | Updated on Sep 3 2017 12:11 PM

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై నిరసన వ్యక్తం చేసిన రైతులో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని, అతని ఆగ్రహానికి

సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై నిరసన వ్యక్తం చేసిన రైతులో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని, అతని ఆగ్రహానికి కారణాలను చూడకుండా ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతాంగంలో ఉన్న ఆక్రోశం, ఆగ్రహం, అసంతృప్తికి సూచికగా కడియం శ్రీహరిపై నిరసన వ్యక్తం చేశారనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. టీఆర్‌ఎస్ ధనబలంతో, అధికారబలంతో ఉప ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతోందని.. ఈ ఎన్నికలపై వీడియోలతో నిఘాను ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌కు సుధాకర్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement