పేదలకు ఆరోగ్యశ్రీని దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు.
తిరుపతి: ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్నది కపట ప్రేమేనని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరిట ఉన్న పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, ఇప్పుడు ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. పేదలకు ఆరోగ్యశ్రీని దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.