మాజీ ప్రియురాలే చంపేసింది | missing rajampet young man murdered | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియురాలే చంపేసింది

Jun 1 2016 2:06 PM | Updated on Sep 4 2017 1:25 AM

సాయిప్రకాశ్‌రాజు (ఫైల్)

సాయిప్రకాశ్‌రాజు (ఫైల్)

వైఎస్సార్ జిల్లా రాజంపేటలో అదృశ్యమైన యువకుడు గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు.

రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేటలో అదృశ్యమైన యువకుడు గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. అతడి మాజీ ప్రియురాలు సునీతే చంపిందని పోలీసులు తేల్చారు. ప్రియుడు నాగేంద్రతో కలిసి సాయిప్రకాశ్‌రాజును హతమార్చింది. గుట్టుచప్పుడు కాకుండా వీరిద్దరూ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 28న సాయి కనపించడంలేదని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సునీతతో సాయికి వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అతడిపై గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement