ప్రజాసేవలోనే సంతప్తి | minister palle bithday anniversary | Sakshi
Sakshi News home page

ప్రజాసేవలోనే సంతప్తి

Sep 18 2016 10:56 PM | Updated on Sep 4 2017 2:01 PM

జీవించినంత కాలం ప్రజాసేవ చేస్తానని, అందులోనే సంతప్తి ఉందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి అన్నారు.

అనంతపురం అర్బన్‌ : జీవించినంత కాలం ప్రజాసేవ చేస్తానని, అందులోనే సంతప్తి ఉందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి జన్మదినాన్ని నగరంలోని ఆయన స్వగహంలో అభిమానులు వేడుక నిర్వహించారు. మంత్రికి పూలమాలలు వేసి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ప్రజాసేవ చేయడంలో ఉన్న సంతప్తి ఎందులోనూ లభించదన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయి తగ్గట్టుగా ప్రజాసేవ చేయాలన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement