కాకా హోటల్లో హరీశ్ రావు | Minister harishrao ate lunch in kaka hotel | Sakshi
Sakshi News home page

కాకా హోటల్లో హరీశ్ రావు

Feb 10 2016 5:25 PM | Updated on Sep 3 2017 5:22 PM

కాకా హోటల్లో హరీశ్ రావు

కాకా హోటల్లో హరీశ్ రావు

ఆయనో మంత్రి. కోరుకుంటే ఫైవ్‌ స్టార్‌ హోటల్లో, ఖరీదైన భోజనం చేయగలరు. ఎక్కడి నుంచి అయినా కావాల్సిన వంటకాలు తెప్పించుకుని తినగలరు...

నారాయణ్ఖేడ్: ఆయనో మంత్రి. కోరుకుంటే ఫైవ్‌ స్టార్‌ హోటల్లో, ఖరీదైన భోజనం చేయగలరు. ఎక్కడి నుంచి అయినా కావాల్సిన వంటకాలు తెప్పించుకుని తినగలరు...మరి అలాంటి వ్యక్తిని ఓ రోడ్డు సైడ్‌ హోటల్‌లో తింటూ ఊహించగలమా....అందులోనూ పులిహోర, కారా, పొంగల్‌ లాంటి మామూలు వంటలు. నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక ప్రచారంలో... సరిగ్గా ఇదే జరిగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకో....లేదంటే ప్రచారంలో తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేసిందో తెలియదు కానీ....తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఓ కాకా హోటల్‌లో సందడి చేశారు.

పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి.... సదా సీదా వంటలు భుజించి ఆకలి తీర్చుకున్నారు. అంతేకాదు...చుట్టుపక్కలున్న తన అనుచరులకు కూడా కొసరి కొసరి వడ్డించారు. ఓ రాష్ట్రమంత్రి ఓ సాదాసీదా హోటల్‌లో సామాన్యుడిల్లా తింటుండడంతో....దీన్ని చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. మంత్రి హరీష్‌రావే కాదు... డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్‌ రెడ్డి కూడా సహచరులతో కబుర్లు చెప్పుకుంటూ సామాన్యుడి వంటకాలను ఆరగించేశారు.

Advertisement
 
Advertisement
Advertisement