breaking news
Narayanakhed by-poll
-
అభివృద్ధిలో ఆదర్శంగా నారాయణఖేడ్.. బీఆర్ఎస్కే అధికార పగ్గాలా?
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలానికి చెందిన గ్రామం ఇది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018 ఆగస్టు 2న నారాయణఖేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిది ఏళ్లలోనే ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తుంది. వేలకోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతుండడంతో అన్ని వర్గాల ప్రజలకు వసతులు సమకూరుతున్నాయి. నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశాలు : అత్యధికంగా గిరిజన తాండాలు కలిగిన ఖేడ్ నియోజకవర్గం కాబట్టి ఉపాధి కోసం వలసలు పరిశ్రమలు ఇతర ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కారణంగా నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది. ఉపాధి కల్పన నైపుణ్య విద్య సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడం మౌలిక వసతుల్లో భాగంగా గ్రామాల అభివృద్ధి సరిఅయిన రవాణా సౌకర్యం లేకపోవడం కంగ్టీ, నాగలిగిద్ద సిర్గాపూర్, మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ మహా రెడ్డి భూపాల్ రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే ) కాంగ్రెస్ సురేష్ కుమార్ షెత్కర్ పట్లోల సంజీవరెడ్డి ( Ex MPP పిసిసి ఉపాధ్యక్షులు ) బీజేపీ మహా రెడ్డి విజయపాల్ రెడ్డి జన్వాడ సంగప్ప ( అధికార ప్రతినిధి ) వృత్తిపరంగా ఓటర్లు మత్స్యకారులు 16 % పంచకర్మలు 5% కుమ్మరి 2% మంగలి 2% చాకలి 3 % యాదవులు 10 % SC లు 12 % ST లు 16 % మైనార్టీలు 12% ఇతరులు 22 % నియోజకవర్గంలో ఆసక్తికర అంశాలు : ► వార్ కార్ సాంప్రదాయం, కన్నడ తెలుగు మరాఠీ ఉర్దూ తదితర భాషల ప్రయోగం. ► రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు : షట్కార్, మహారెడ్డి, పట్లోళ్ల కుటుంబాల రాజకీయ వారసత్వం. భౌగోళిక పరిస్థితులు : నదులు : కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మంజీరా నది, నల్ల వాగు మధ్యతర ప్రాజెక్టు అడవులు: కడపల్ అటవీ ప్రాంతం ఆలయాలు : కొండాపూర్, పంచగామా, కోర్పోల్, అంతర్గాం, దామరగిద్ద రామాలయం పర్యాటకం : నారాయణఖేడ్, కంగ్టీ,పెద్ద శంకరంపేట్, నిజాంపేట్, మంజీరా నది తీర ప్రాంతం -
కాకా హోటల్లో హరీశ్ రావు
నారాయణ్‌ఖేడ్: ఆయనో మంత్రి. కోరుకుంటే ఫైవ్ స్టార్ హోటల్లో, ఖరీదైన భోజనం చేయగలరు. ఎక్కడి నుంచి అయినా కావాల్సిన వంటకాలు తెప్పించుకుని తినగలరు...మరి అలాంటి వ్యక్తిని ఓ రోడ్డు సైడ్ హోటల్లో తింటూ ఊహించగలమా....అందులోనూ పులిహోర, కారా, పొంగల్ లాంటి మామూలు వంటలు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారంలో... సరిగ్గా ఇదే జరిగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకో....లేదంటే ప్రచారంలో తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేసిందో తెలియదు కానీ....తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఓ కాకా హోటల్లో సందడి చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి.... సదా సీదా వంటలు భుజించి ఆకలి తీర్చుకున్నారు. అంతేకాదు...చుట్టుపక్కలున్న తన అనుచరులకు కూడా కొసరి కొసరి వడ్డించారు. ఓ రాష్ట్రమంత్రి ఓ సాదాసీదా హోటల్లో సామాన్యుడిల్లా తింటుండడంతో....దీన్ని చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. మంత్రి హరీష్‌రావే కాదు... డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి కూడా సహచరులతో కబుర్లు చెప్పుకుంటూ సామాన్యుడి వంటకాలను ఆరగించేశారు.