‘బీజేపీ నేతలకు అవగాహన లేదు’ | minister ayyannaptrudu comments on ap special status | Sakshi
Sakshi News home page

‘బీజేపీ నేతలకు అవగాహన లేదు’

May 18 2016 4:28 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘బీజేపీ నేతలకు అవగాహన లేదు’ - Sakshi

‘బీజేపీ నేతలకు అవగాహన లేదు’

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి మోదీ నిలబెట్టుకోవాలని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

విజయవాడ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి మోదీ నిలబెట్టుకోవాలని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని రాష్ట్రంలోని ఎన్నికల సభల్లో మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో రాజధాని కోసం అంత డబ్బు ఎందుకుని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు. వారి మాటలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అయ్యన్న కొట్టిపారేశారు. హామీలను అమలు చేయాలని కోరుతూ పలుమార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement