16, 17లో 'నన్నయ' ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే దీనిని భారీ జాబ్ మేళాగా పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికాస్, ఎన్టీఆర్ ట్రస్టులతో కలసి నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో విప్రో
పరీక్షలను వాయిదా వేసిన నన్నయ వర్సిటీ వీసీ
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే దీనిని భారీ జాబ్ మేళాగా పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికాస్, ఎన్టీఆర్ ట్రస్టులతో కలసి నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో విప్రో, ఇన్ఫోసిస్ వంటి వంద కంపెనీలు పాల్గొంటాయన్నారు. సుమారు ఆరు వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో మూడు నెలలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. అయితే శిక్షణ పొందని వారు కూడా హాజరుకావొచ్చన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్, బీటెక్, ఎంటెక్, తదితర అర్హతలున్న వారంతా హాజరుకావొచ్చన్నారు. సుమారు వంద కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు వస్తున్నందున ఉభయ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'నన్నయ' లో పరీక్షలు వాయిదా
రాజమహేంద్రవరంలో జరగనున్న మెగా జాబ్ మేళాకు తమ యూనివర్సిటీ పరిధిలోని అర్హత ఉన్న విద్యార్థులు కూడా హాజరయ్యేందుకు వీలుగా గురువారం (15వ తేదీ) నుంచి వరుసగా మూడు రోజులపాటు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామన్నారు. ఆ పరీక్షలు తిరిగి 19వ తేదీ నుంచి జరుగుతాయని వీసీ తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశామన్నారు.