వివేకానంద డిగ్రీ కళాశాలలో మాస్‌కాపీయింగ్‌ | masscopying in vivekananda degree college | Sakshi
Sakshi News home page

వివేకానంద డిగ్రీ కళాశాలలో మాస్‌కాపీయింగ్‌

Nov 15 2016 12:09 AM | Updated on Sep 4 2017 8:05 PM

పట్టణంలోని జ్ఞాన సరస్వతి, వివేకానంద డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

బేతంచెర్ల : పట్టణంలోని  జ్ఞాన సరస్వతి, వివేకానంద డిగ్రీ కళాశాలల్లో   డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి.  సోమవారం విద్యార్థులు  కమ్యూనికేషన్‌ స్కిల్స్‌–1,  ఎన్విరాన్‌మెంటల్‌ –1 పరీక్ష రాస్తున్నారు.  ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ కోఆర్డినేటర్‌  రాజగోపాలు రెడ్డి వివేకానంద కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా  11 మంది విద్యార్థులు  కాపీలు రాస్తూ పట్టుబడ్డారు. ఇక నుంచి ఎవరైనా మాస్‌కాపీలను ప్రోత్సహిస్తే సంబంధిత సెంటర్‌ను రద్దు చేస్తామని ప్రిన్సిపాల్‌ విజయ్‌ను   ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ కోఆర్డినేటర్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement