మదినూపిన వేణుగానం | Manda Flute kacheri | Sakshi
Sakshi News home page

మదినూపిన వేణుగానం

Nov 6 2016 11:24 PM | Updated on Sep 4 2017 7:23 PM

మదినూపిన వేణుగానం

మదినూపిన వేణుగానం

భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల సంయుక్త నిర్వహణలో సంగీత కళాశాలలో ఆదివారం తిరుపతికి చెందిన సంగీత విద్యాంసుడు మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ మంత్రముగ్ధుల్ని చేసింది.

విజయవాడ కల్చరల్‌ : భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల సంయుక్త నిర్వహణలో సంగీత కళాశాలలో ఆదివారం తిరుపతికి చెందిన సంగీత విద్యాంసుడు మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ కీర్తనలు శాస్త్రీయ సంగీత సంప్రదాయ వైభవాన్ని చాటాయి. షణ్ముఖ రాగంతో ప్రారంభించి శ్రీ  దీక్షితార్‌ కీర్తన మహాగణపతిం, త్యాగరాజస్వామి వారి కీర్తన దరిని తెలుసు కొంటి, నిరవది సుభద తదితర కీర్తనలను ఆలపించారు.
కార్యక్రమాలపై సమాచారం కరువాయే
భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం సంగీత కళాశాలలో ప్రముఖ విద్వాంసులచే కచేరీలు నిర్వహిస్తోంది. కళాకారుకు భారీగానే ముట్టచెబుతోంది, çసంగీత అభిమానులకు సమాచారం ఇవ్వటంలో మాత్రం విఫలమవుతోంది. దీంతో సంగీత అభిమానుల హాజరు అంతంతమాత్రమే. నిత్యం సంగీత కళాశాలకు వచ్చేవారు తప్ప మిగతావారికి తెలియడం లేదని వాపోతున్నారు. సమాచారం అందజేస్తే మరింత ఎక్కువమంది హాజరౌతాన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తంచేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement