breaking news
gvr college
-
నాటకానికి సామాజిక ప్రయోజం ముఖ్యం
విజయవాడ కల్చరల్ : నాటకానికి సామాజిక ప్రయోజనం ముఖ్యమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి.విజయభాస్కర్ పేర్కొన్నారు. ఆర్ఆర్ క్రియేషన్స్ ఆంధ్ర ప్రదేశ్ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్థి సంస్థలు సంయుక్తంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించిన ద్వితీయ ఆహ్వాన నాటకోత్సవాల ముగింపు సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో విజయభాస్కర్ మాట్లాడుతూ ఆర్ఆర్ క్రియేన్స్ నాటక సంస్థను మహిళలే నిర్వహిస్తున్నారని, అందరూ స్త్రీల పాత్రలతో నాటక పోటీలు నిర్వహిస్తే భాషా సంస్కృతిక శాఖ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. నాటకరంగంలో అన్నిశాఖలను మహిళలే నిర్వహించేలా ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ కార్యదర్శి ఎస్. రాజేశ్వరి, కోశాధికారి ఎం.చాందిని, అధ్యక్షులు వై.భవాని తదితరులు ప్రసంగించారు. అనంతరం పేద మహిళలకు బియ్యం, చీరలు పంపిణీచేశారు. మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు, మహేశ్వరీప్రసాద్ కామెడీ క్లబ్ అధ్యక్షుడు బాల గంగాధర తిలక్, నటుడు దర్శకుడు సుఖమంచి కోటేశ్వరరావు, బాలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాటకాలు ప్రదర్శించిన సంస్థలకు డాక్టర్ విజయభాస్కర్ జ్ఞాపికలు, నగదుపారితోషికం అందించారు. మధు థియేటర్స్ తుళ్లూరు ప్రదర్శించిన నిశ్శబ్ద సంకేతం, వెలగలేరు థియేటర్స్ సంస్థ ప్రద్శించిన ఎవరికి ఎవరు నాటకం సామాజిక అంశాలను ప్రస్తావించాయి. -
మదినూపిన వేణుగానం
విజయవాడ కల్చరల్ : భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల సంయుక్త నిర్వహణలో సంగీత కళాశాలలో ఆదివారం తిరుపతికి చెందిన సంగీత విద్యాంసుడు మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ కీర్తనలు శాస్త్రీయ సంగీత సంప్రదాయ వైభవాన్ని చాటాయి. షణ్ముఖ రాగంతో ప్రారంభించి శ్రీ దీక్షితార్ కీర్తన మహాగణపతిం, త్యాగరాజస్వామి వారి కీర్తన దరిని తెలుసు కొంటి, నిరవది సుభద తదితర కీర్తనలను ఆలపించారు. కార్యక్రమాలపై సమాచారం కరువాయే భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం సంగీత కళాశాలలో ప్రముఖ విద్వాంసులచే కచేరీలు నిర్వహిస్తోంది. కళాకారుకు భారీగానే ముట్టచెబుతోంది, çసంగీత అభిమానులకు సమాచారం ఇవ్వటంలో మాత్రం విఫలమవుతోంది. దీంతో సంగీత అభిమానుల హాజరు అంతంతమాత్రమే. నిత్యం సంగీత కళాశాలకు వచ్చేవారు తప్ప మిగతావారికి తెలియడం లేదని వాపోతున్నారు. సమాచారం అందజేస్తే మరింత ఎక్కువమంది హాజరౌతాన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తంచేశారు.